ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

తల్లితో సహజీవనం.. ఆమె కూతురుని సైతం.. మరీ ఇంత దారుణమా..? - ఆరు సంవత్సరాల చిన్నారిపై రేప్‌

LATEST RAPE NEWS: తండ్రి లేని చిన్నారిని తన తల్లి పలు వ్యవసాయ పనులు చేసుకుంటూ పోషించుకునేది. అయితే భర్త లేకపోవడంతో మరో వ్యక్తితో సహజీవనం సాగించింది. ఈ సహజీవనమే తన చిన్నారి పాప మరణానికి కారణమవుతుందని అప్పుడు అర్థం కాలేదు.. కనీసం చిన్నపిల్ల అని చూడకుండా ఘోరానికి ఒడిగట్టాడు.. ఈ విషయం బయటపడకుండా తన తల్లినే పావుగా వాడుకున్నాడు.. అయితే సత్యం అన్నది ఎంత దాగిన దాగదు అంటారు కదా ఇక్కడా అదే జరిగింది.

rape on 6 years old girl
rape on 6 years old girl

By

Published : Oct 30, 2022, 8:12 PM IST

RAPE ON NIZAMABAD:తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆరేళ్ల బాలికపై తండ్రి వరుస అయిన వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది. నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండలంలోని ఓ గ్రామంలో జరిగిన ఈ ఘటన శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసుల కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లాకు చెందిన పలువురు వలస కూలీలు వ్యవసాయ పనుల నిమిత్తం కొద్దిరోజుల కిందట డిచ్‌పల్లి మండలంలోని ఓ గ్రామానికి వచ్చి వారి కుటుంబాలతో ఉంటున్నారు. ఓ మహిళకు భర్త లేకపోవటంతో గోవింద్‌రావు అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. అప్పటికే ఆమెకు ఆరేళ్ల బాలిక ఉంది. ఈ నెల 20న బాలికపై అతడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఒంటిపై గాయాలు చేశాడు. బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లటంతో అక్కడి నుంచి తప్పించుకొన్నాడు. కాసేపటికి బాలిక తల్లి వచ్చి చిన్నారిని నిజామాబాద్‌లోని ఓ ఆసుపత్రికి తీసుకువెళ్లింది. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పటంతో హైదరాబాద్‌లోని నిలోఫర్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 23వ తేదీన బాలిక మరణించింది.

ఘటన బయటపడుతుందని బాలిక తల్లిని మభ్యపెట్టిన నిందితుడు.. ఈ విషయం పోలీసుల వరకు వెళ్తే అత్యాచారం చేసిన విషయం బయటపడుతుందని నిందితుడు గోవిందరావు బాలిక తల్లిని ఏ మార్చాడు. పోలీసులు కేసు నమోదు చేస్తే పాప మృతదేహానికి పోస్టుమార్టం చేయిస్తారని, సహజ మరణంగా చెప్పి ఆసుపత్రి నుంచి బాలిక మృతదేహాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. అయితే అప్పటికే ఆసుపత్రి సిబ్బంది డిచ్‌పల్లి పోలీసులకు ప్రాథమిక సమాచారం అందించారు. ఒక దఫా డిచ్‌పల్లి పోలీసులు హైదరాబాద్‌కు వెళ్లిన బాలిక తల్లి ఫిర్యాదు చేయకుండా నిందితుడు అడ్డుకున్నాడు. చివరకు పోలీసులు బాలిక మృతదేహాన్ని నిజామాబాద్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆడుకుంటూ ప్రమాదవశాత్తు పడిపోయి మరణించినట్లుగా తల్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇదే సెక్షన్ కింద తొలత కేసు నమోదు చేసుకున్నారు.

పోస్టుమార్టంలో బయటపడిన అసలు విషయం.. శవ పరీక్ష నిర్వహించిన వైద్యులు బాలిక ఒంటిపై ఉన్న గాయాలను చూసి అనుమానాలు వ్యక్తం చేశారు. ఈనెల 26న డిచ్‌పల్లి పోలీసులకు పోస్టుమార్టం ప్రాథమిక నివేదికను సమర్పించారు. దీన్ని చూసి పోలీసులు కంగుతిన్నారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బాలిక తల్లిని ప్రశ్నించారు. అనంతరం గోవిందరావుని విచారించగా తానే అత్యాచారం చేసినట్లు అంగీకరించాడు. ఈ కేసులో అత్యాచారం, హత్యతో పాటు పోక్సో సెక్షన్ జోడించామని నిందితుడిని త్వరలోనే రిమాండ్ కు తరలిస్తున్నట్లు నిజామాబాద్ ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details