ROBBERY: ప్రకాశం జిల్లా కొమరోలులోని యూనియన్ బ్యాంకులో గుర్తుతెలియని వ్యక్తి 52 గ్రాముల బంగారాన్ని దొంగిలించాడు. ఓ స్వచ్ఛంద సేవా సంస్థ పేరుతో చందా వసూలు చేసేందుకు వచ్చిన అతడు.. గోల్డ్ లోన్స్ కౌంటర్ వద్ద ఉన్న 52 గ్రాముల బంగారాన్ని తీసుకొని ఉడాయించాడు. బ్యాంకు ముగిసే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సాయంత్రం బంగారం లెక్కపెట్టుకునే సమయంలో 52 గ్రాముల బంగారం చోరీకి గురైందని అధికారులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని సీసీ పుటేజీలను పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగ కోసం గాలిస్తున్నారు.
ROBBERY: 'విరాళం కోసం వచ్చాడు.. బంగారంతో ఉడాయించాడు' - ప్రకాశం జిల్లా తాజా వార్తలు
ROBBERY: ఓ స్వచ్ఛంద సేవా సంస్థ పేరుతో చందా వసూలు చేసేందుకు వచ్చిన ఓ వ్యక్తి యూనియన్ బ్యాంకులో చేతివాటం ప్రదర్శించాడు. గోల్డ్ లోన్స్ కౌంటర్ వద్ద ఉన్న 52 గ్రాముల బంగారాన్ని తీసుకొని ఉడాయించాడు. సాయంత్రం బంగారం లెక్కపెట్టుకునే సమయంలో అధికారులు బంగారం చోరీకి గురైందని తెలుసుకొని అవాక్కయ్యారు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది.
"విరాళం కోసం వచ్చాడు.. బంగారంతో ఉడాయించాడు"