nirmal district in telangana: తెలంగాణలోని నిర్మల్ జిల్లా భైంసా మండలం తిమ్మాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 30 మందికి తీవ్రగాయాలయ్యాయి. గొల్లమడ వెళ్తున్న బస్సును వెనక నుంచి నిర్మల్ వెళ్తున్న బస్సు ఢీకొంది. క్షతగాత్రులను భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. రెండు బస్సుల్లో సుమారు 80 మంది వరకు ఉండొచ్చని సమాచారం. ఘటనా స్థలిని భైంసా ఏఎస్పీ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు.
nirmal district in telangana: తెలంగాణలో ఢీకొన్న రెండు ఆర్టీసీ బస్సులు... 30మందికి గాయాలు - nirmal road accident
nirmal district in telangana: తెలంగాణలోని నిర్మల్ జిల్లా భైంసా మండలం తిమ్మాపూర్ వద్ద రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 30 మందికి తీవ్రగాయాలయ్యాయి.
![nirmal district in telangana: తెలంగాణలో ఢీకొన్న రెండు ఆర్టీసీ బస్సులు... 30మందికి గాయాలు 2 rtc bus collision in telangana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14662134-479-14662134-1646647172861.jpg)
తెలంగాణలో ఢీకొన్న రెండు ఆర్టీసీ బస్సులు