PEDDAPALLI ACCIDENT: తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గంగానగర్ వద్ద ప్రమాదం జరిగింది. రెండు లారీలు పరస్పరం ఢీకొని.. ఆటోపై పడ్డాయి. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు దుర్మరణం చెందారు. మరికొంత మంది గాయపడ్డారు.
PEDDAPALLI ACCIDENT: ఘోర రోడ్డు ప్రమాదం.. 3 నెలల చిన్నారి సహా దంపతులు మృతి - పెద్దపల్లి రోడ్డు ప్రమాదంలో 3 మృతి
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గంగానగర్ వద్ద ప్రమాదం జరిగింది. రెండు లారీలు పరస్పరం ఢీకొని.. ఆటోపై పడ్డాయి. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు దుర్మరణం చెందారు. మృతుల్లో దంపతులతో పాటు 3 నెలల చిన్నారి ఉంది.

రామగుండంకు చెందిన షేక్ షేకిల్ అతని భార్య రేష్మ, ఇద్దరు చిన్నారులు సహా మరో ఇద్దరు మంచిర్యాల జిల్లా ఇందారం గ్రామానికి వెళ్తున్నారు. గోదావరిఖని గంగానగర్ ఫైఓవర్ యూటర్న్ వద్ద బొగ్గు లోడ్‌తో వస్తున్న లారీ, మట్టిని తీసుకొస్తున్న మరో లారీ పరస్పరం ఢీకొట్టాయి. అనంతరం పక్కనే ప్రయాణిస్తున్న ఆటోపై బోల్తాపడ్డాయి. ఈ ఘటనలో షేక్ షేకిల్, రేష్మ, మరో చిన్నారి మృతిచెందగా.. రెండు నెలల చిన్నారి సహా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటన స్థలికి చేరిన పోలీసులు క్రేన్ సాయంతో చిన్నారిని బయటకు తీశారు. క్షతగాత్రులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి:వేగంగా రెండు కార్లుదూసుకొచ్చాయి.. పొగమంచులో రోడ్డు కనిపించలేదు..