తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ సమీపంలోని అన్నారం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. హైదరాబాద్ నుంచి జడ్చర్లు వైపు వెళ్తున్న కారు.. అన్నారం వద్దకు రాగానే అదుపుతప్పింది.
డివైడర్‌పైకి దూసుకువెళ్లి.. అటుగా వచ్చిన లారీని ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా స్థానికులు చెబుతున్నారు.