తెలంగాణ: పంతంగి టోల్‌ప్లాజా వద్ద 25 కిలోల బంగారం పట్టివేత - యాదాద్రి: పంతంగి టోల్‌ప్లాజా భారీగా బంగారం పట్టివేత
![తెలంగాణ: పంతంగి టోల్‌ప్లాజా వద్ద 25 కిలోల బంగారం పట్టివేత పంతంగి టోల్‌ప్లాజా వద్ద 25 కిలోల బంగారం పట్టివేత](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11140512-111-11140512-1616585022724.jpg)
16:20 March 24
16:04 March 24
రూ.11.63 కోట్ల విలువైన బంగారు బిస్కట్లు స్వాధీనం
హైదరాబాద్ నగర శివారుల్లో పెద్ద మొత్తంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో రూ.11.63కోట్లు విలువైన 25కిలోల బంగారాన్ని పట్టుకున్నామని డీఆర్‌ఐ అధికారులు వెల్లడించారు. ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. గౌహతి నుంచి హైదరాబాద్‌కు తరలిస్తుండగా నగర శివారుల్లో పతంగి టోల్ ప్లాజా వద్ద సోదాలు నిర్వహించి స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.
ఎలాంటి అనుమానం రాకుండా కారులో ఫ్రంట్ సీటు బ్యాక్ బోర్డు తొలగించి బంగారాన్ని దాచినట్లు అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్నదంతా విదేశీ బంగారమని అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లో పలు బంగారు దుకాణాలకు చేరవేసేందుకు తెస్తున్నట్లుగా గుర్తించామన్నారు.
ఇదీ చదవండి: