కర్నూలు జిల్లాలో తెలంగాణ సరిహద్దు పంచలింగాల చెక్‌పోస్టు వద్ద 25 కిలోల వెండిని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అధికారులు చేపట్టిన వాహన తనిఖీల్లో 25 కిలోల వెండి లభ్యమైంది. టీఎస్ఆర్టీసీ గరుడ ప్లస్ బస్సులో హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్తున్న తమిళనాడుకు చెందిన ఉదయకుమార్ అనే వ్యక్తి వెండి తరలిస్తున్నట్లు గుర్తించారు. ఎలాంటి ఆధారాలు లేకపోవటంతో వెండిని సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
పంచలింగాల చెక్ పోస్టు వద్ద తనిఖీలు.. 25 కిలోల వెండి స్వాధీనం - కర్నూలు క్రైమ్ వార్తలు
కర్నూలు-తెలంగాణ సరిహద్దు పంచలింగాల చెక్ పోస్టు వద్ద టీఎస్ఆర్టీసీ బస్సులో అక్రమంగా తరలిస్తున్న 25 కిలోల వెండిని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు తమిళనాడుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.
25 kilo silver sized