షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరగడంతో 20 మేకలు సజీవ దహనమైన ఈ ఘటన గుంటూరు జిల్లా కొల్లిపర మండలం మున్నంగిలో జరిగింది. గ్రామానికి చెందిన శేషమ్మ అనే మహిళ ఇంట్లో బుధవారం అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. పూరిల్లు కావడంతో మంటలు భారీగా ఎగసిపడ్డాయి. అనంతరం పక్కనే ఉన్న మేకల పాకాకు మంటలు అంటుకోవడంతో.. 20 మేకలు మంటలలో చిక్కుకుని సజీవ దహనమయ్యాయి.
మంటల్లో చిక్కుకుని 20 మేకలు సజీవదహనం.. - అగ్ని ప్రమాదంలో మేకలు సజీవ దహనం
షాట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి పాకలోని 20 మేకలు సజీవ దహనమయ్యాయి. ఈ ఘటన ఘటన గుంటూరు జిల్లా కొల్లిపర మండలం మున్నంగిలో జరిగింది. ఈ ప్రమాదంలో పూరిల్లు పూర్తిగా దగ్ధమయ్యింది. సుమారు రూ.10 లక్షల మేర ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అగ్నిమాపక సిబ్బంది అంచనా వేశారు.
![మంటల్లో చిక్కుకుని 20 మేకలు సజీవదహనం.. 20 goats died in fire accident](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11574322-135-11574322-1619641714508.jpg)
20 మేకలు సజీవదహనం
సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి వచ్చే లోపే మూగ జీవాలన్ని అగ్నికి ఆహూతయ్యాయి. ఇళ్లు దగ్ధం అవ్వడంతో పాటు, మేకలు చనిపోవడంతో సుమారు రూ.10లక్షల మేర అస్తి నష్టం జరిగి ఉంటుందని అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు.