ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

"స్వచ్ఛ భారత్​ అధికారులమంటూ వచ్చి.. బంగారంతో ఉడాయించారు" - ఆంధ్రప్రదేశ్​ నేర వార్తలు

THEFT: స్వచ్ఛ భారత్​ అంటే గ్రామాలు, పట్టణాలు శుభ్రం చేయడమని మనకు తెలుసు. కానీ ఇక్కడ స్వచ్ఛ భారత్​ అంటే ఇంట్లో నగలు దోచుకెళ్లడం. అదేంటి అనుకుంటున్నారా. అవును అధికారులు పేరుతో మాయమాటలు చెప్పి చోరికి పాల్పడ్డారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

ROBBERY
ROBBERY

By

Published : Jul 15, 2022, 2:03 PM IST

THEFT: బ్యాంకు అధికారులమని కొందరు, జనాభా లెక్కలోల్లమని మరికొందరు వచ్చి డబ్బులు, నగలు ఎత్తుకెళ్లారనే వార్తలు చాలా చోట్ల చదువుతూనే ఉంటాము. ఇక్కడ కూడా ఇలానే జరిగింది. కాకపోతే ఇక్కడ దొంగలు కాస్తా ట్రెండ్​ మార్చారు. బ్యాంకు, సర్వే అధికారులమంటే ఎక్కడ దొరుకుతామనే అనుమానంతో.. స్వచ్ఛ భారత్​ అధికారులమంటూ వచ్చి బంగారాన్ని ఎత్తుకెళ్లారు. ఈ ఘటన కర్నూలు జిల్లా ఆదోనిలో జరిగింది.

పట్టణంలోని అరుంజ్యోతి నగర్​లో సంధ్యారాణి అనే మహిళ ఇంటికి స్వచ్ఛ భారత్ అధికారులమంటూ దొంగలు పడ్డారు. ఇంట్లో డ్రైనేజ్​ పైపు ఎక్కడుందని అడిగి.. ఇద్దరు వ్యక్తులు మాయమాటలు చెప్పి నమ్మించారని.. వారితో పాటు వచ్చిన మరో వ్యక్తి 13 తులాల బంగారం ఎత్తుకెళ్లాడని సంధ్యారాణి తెలిపింది. బాధితురాలి భర్త జనార్ధన్ ఆర్ట్స్ కళాశాలలో వ్యాయమ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details