YSR VAHANA MITRA: వైఎస్ఆర్ వాహన మిత్ర పథకానికి సంబంధించి నాల్గో ఏడాది ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ విడుదల చేయనుంది. సొంత వాహనం కలిగిన ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు తమ వాహన అవసరాల కోసం పదివేల చొప్పున ఆర్థిక సాయం చేయనుంది. 2,61,516 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున 261.52 కోట్ల ఆర్థిక సాయం చేయనుంది.
YSR VAHANA MITRA: నేడు సీఎం విశాఖ పర్యటన.. వాహనమిత్ర ఆర్థిక సాయం విడుదల - YSR VAHANAMITRA FOURTH YEAR FUNDS NEWS
YSR VAHANA MITRA: వైఎస్‌ఆర్ వాహనమిత్ర నాల్గో ఏడాది ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ విడుదల చేయనుంది. ఈ పథకం కింద ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు పది వేల రూపాయల ఆర్థిక సాయం చేయనున్నారు.
నేడు విశాఖపట్నంలో జరిగే కార్యక్రమంలో సీఎం జగన్ బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయనున్నారు. నాలుగేళ్లలో రూ.1,026 కోట్లు అందించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇవాళ ఉదయం 9.20 గంటలకు తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు సీఎం జగన్ బయలుదేరనున్నారు. 10.30 గంటలకు విశాఖ చేరుకోనున్న సీఎం.. 11.05 గంటలకు ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్స్‌కు చేరుకుని వైఎస్ఆర్ వాహన మిత్ర లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 1.20 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్ట్ నుంచి తాడేపల్లికి బయలుదేరుతారు.
ఇదీ చదవండి: