ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జల సంరక్షణపై యువకుల సైకిల్ యాత్ర - నక్కపల్లిలో జలసంరక్షణపై యువకుల సైకిల్ యాత్ర వార్తలు

నీటిని కాపాడుకుందాం...అంటూ జల సంరక్షణపై ఇద్దరు యువకులు అవగాహన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందుకు ముంబయి నుంచి వియత్నాంకు సైకిల్ యాత్ర చేపట్టారు.

cycle-rally
cycle-rally

By

Published : Feb 8, 2020, 9:14 AM IST

నీటిని పరిరక్షించాలనే నినాదంతో ఇద్దరు యువకులు ముంబయి నుంచి వియత్నాంకు సైకిల్ యాత్ర చేపట్టారు. బెంగళూరులోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న మితేష్​సింగ్, మోహిత్​కుమార్ చేపట్టిన యాత్ర శుక్రవారం విశాఖ జిల్లా నక్కపల్లికి చేరింది. నీటి విలువను పిల్లలకు తెలిపేందుకే యాత్ర చేపట్టినట్లు.. ముంబయి నుంచి కోల్​కతా మీదుగా వియత్నాంలోని వుంగటా ప్రాంతానికి చేరుకుంటామని వారు తెలిపారు. మార్గమధ్యలో 30 పాఠశాల విద్యార్థులకు నీటి ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తామన్నారు. ఇప్పటివరకు 12 పాఠశాలు పూర్తయ్యాయని యువకులు చెబుతున్నారు.

జలసంరక్షణపై యువకుల సైకిల్ యాత్ర

ABOUT THE AUTHOR

...view details