ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Rape on Girl : పుల్లలేరుకుంటున్న బాలికపై యువకుడి అత్యాచారం...బెదిరింపు...

Rape on Girl : విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో పదకొండేళ్ళ బాలికపై గ్రామానికి చెందిన 20 ఎళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.విషయం ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించి వదిలిపెట్టిన ఘటన చోటు చేసుకుంది.

Rape on Girl
పుల్లలేరుకుంటున్న బాలికపై యువకుడి అత్యాచారం...బెదిరింపు...

By

Published : Jan 21, 2022, 5:36 PM IST

Rape on Girl : విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామానికి చెందిన పదకొండేళ్ల బాలిక...గురువారం ఎప్పటిలాగే గ్రామ సమీపంలో పుల్లలు ఏరుకునేందుకు వెళ్లింది. బాలిక ఒంటరిగా ఉండటాన్ని గమనించాడు అక్కడే ఉన్న అదే గ్రామానికి చెందిన 20ఏళ్ల యువకుడు. చుట్టుపక్కల ఎవరూ లేరని గుర్తించి బాలిక నోట్లో గుడ్డలు కుక్కి ఆపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఏడుస్తున్న బాలికను జరిగిన విషయం ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించి వదిలిపెట్టాడు.భయపడుతూ ఇంటికి చేరుకున్న బాలిక రాత్రి ఇంట్లో వారికి విషయం వివరించింది. ఆమె కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం నక్కపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలు పార్టీల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details