Young man died while moving marijuana: విశాఖ జిల్లా పెందుర్తిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్ఆర్ వెంకటాపురం బీఆర్టీఎస్ రోడ్డులో గంజాయి తరలిస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. పశ్చిమగోదావరికి చెందిన గోపి కృష్ణ (23), విశాఖపట్నానికి చెందిన వరుణ్ ఇద్దరూ కలిసి తమ ద్విచక్ర వాహనంపై అరకు నుంచి విశాఖపట్నం వస్తున్నారు. ఆ సమయంలో వీరు బైక్‌లో గంజాయి తరలిస్తున్నారు. బీఆర్టీఎస్ రోడ్డు వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పడంతో ప్రమాదం జరిగింది. కిందపడిన గోపి కృష్ణ(23) అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పెందుర్తి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొన్నారు. మృతదేహాన్ని కేజీహెచ్‌కి తరలించారు. వరుణ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
Young man died while moving marijuana: గంజాయి తరలిస్తుండగా ప్రమాదం..యువకుడు మృతి - పెందుర్తిలో బైక్ యాక్సిడెంట్
Young man died while moving marijuana: ద్విచక్ర వాహనంలో గంజాయి తరలిస్తుండగా బైక్ అదుపు తప్పి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 23ఏళ్ల యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన విశాఖ జిల్లా పెందుర్తిలో జరిగింది.
గంజాయి తరలిస్తుండగా ప్రమాదం..యువకుడు మృతి