వైకాపా సొంత ప్రయోజనాల కోసం ఎన్డీయేతో కలవాలనుకుంటోందని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా శనివారం ఆయన విశాఖలో పర్యటించారు. ప్రత్యేక హోదాపై ఎన్నికల సమయంలో చెప్పిన మాటలు ఇప్పుడు ఏమయ్యాయని సీఎం జగన్ను ప్రశ్నించారు. ఉత్తరాంధ్రాకు రావాల్సిన నిధులను కేంద్రం నుంచి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
స్వలాభం కోసమే ఎన్డీయేలోకి వైకాపా: శైలజానాథ్ - సీఎం జగన్ దిల్లీ పర్యటన
వైకాపా ఎన్డీయేలో చేరాలనుకుంటుంది రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదని... పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ విమర్శించారు. దిల్లీ పర్యనటతో ముఖ్యమంత్రి జగన్ సాధించిందేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. వినతిపత్రం ఇవ్వటానికే దిల్లీ వెళ్లారా అని ప్రశ్నించారు.
pcc chief sailajanath
దిల్లీ పర్యటనతో ముఖ్యమంత్రి జగన్ సాధించింది ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. వినతిపత్రం ఇవ్వటానికే దిల్లీ వెళ్లారా అని నిలదీశారు. పాలనా వైఫల్యం కప్పిపుచ్చుకోవడానికే మూడు రాజధానులు అంశం తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు. రాజధాని విషయంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసి ప్రజలకు అండగా నిలుస్తామని పేర్కొన్నారు.