వైకాపాకు సిద్ధాంతాలు ఉన్నాయని.. వాటికి అనుగుణంగా ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకుంటారని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖలో మాట్లాడుతూ.. సీఎం జగన్ పనితీరు చూసి పార్టీలో చేరేందుకు అనేకమంది సిద్ధంగా ఉన్నారన్నారు. అయితే ఇతర పార్టీల ఎమ్మెల్యేలు వైకాపాలో చేరాలంటే తమ పదవికి రాజీనామా చేసి రావాలని స్పష్టంచేశారు. వలసలపై ముఖ్యమంత్రి జగన్ ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.
'మా పార్టీకి సిద్ధాంతాలున్నాయి.. ఎమ్మెల్యేలు రాజీనామా చేసి రావాల్సిందే' - పార్టీ వలసలపై విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు
ఇతర పార్టీల ఎమ్మెల్యేలు వైకాాపాలో చేరాలంటే వారి పదవికి రాజీనామా చేయాల్సిందేనని వైకాపా జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డి స్పష్టంచేశారు. సీఎం పనితీరు చూసి చాలామంది పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
విజయసాయిరెడ్డి, వైకాపా జాతీయ కార్యదర్శి