రాష్ట్రంలో సీఎం జగన్ నేతృత్వంలో సుపరిపాలన సాగుతోందని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. విశాఖలో కరోనా వ్యాప్తిని తక్కువ చేసి చూపుతున్నట్టు ప్రతిపక్షాలు అపోహలు సృష్టిస్తున్నాయని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకుడు హైదరాబాద్లో కూర్చొని రాజకీయాలు చేస్తున్నారని... ఆయన ఏపీకి ప్రతిపక్ష నాయకుడా లేక తెలంగాణకా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఇల్లు వదిలి వచ్చి ప్రజలకు సేవ చేయాలని సూచించారు. ఈ సందర్భంగా విశాఖలోని 21వ వార్డులో మంత్రులు అవంతి శ్రీనివాస్, మోపిదేవి వెంకటరమణతో కలిసి కార్మికులు, వార్డు వాలంటీర్లకు సరుకులను పంపిణీ చేశారు.
'చంద్రబాబు ఏపీకి ప్రతిపక్ష నాయకుడా లేక తెలంగాణకా?' - cases of coronavirus in vishakapatnam
తెదేపా అధినేత చంద్రబాబుపై వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. హైదరాబాద్లో కూర్చొని రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు... ఏపీకి ప్రతిపక్ష నేతా లేక తెలంగాణకా అని ప్రశ్నించారు. ఇల్లు వదిలి ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు రావాలన్నారు.
ycp mp vijayasaireddy