''పవన్ లాంగ్ మార్చ్ అంటుంటే.. జనం నవ్వుతున్నారు'' - విశాఖపట్నం
ఇసుక కొరతపై విశాఖ వేదికగా జనసేన తలపెట్టిన లాంగ్ మార్చ్‌ను వైకాపా నాయకుడు విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. రెండున్నర కిలోమీటర్ల నడకతో చేసే ఆందోళనను లాంగ్ మార్చ్ అంటున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ట్వీట్ చేశారు. లాంగ్ మార్చ్ పేరుతో 1934 లో చైనా కమ్యూనిస్ట్ ప్రజా విమోచన సైన్యం మావో నాయకత్వంలో పది వేల కిలోమీటర్లు నడిచి అధికారం సాధించిందని గుర్తు చేశారు.
ycp leader vijayasaireddy
Last Updated : Nov 3, 2019, 11:27 AM IST