ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'మాజీ ఎంపీ సబ్బం హరి ప్రభుత్వ భూమిని ఆక్రమించారు' - మాజీ ఎంపీ సబ్బం హరి ఇంటి గొడవ

మాజీ ఎంపీ సబ్బంహరి నివాసం విషయంలో జీవీఎంసీ అధికారులు చట్టబద్ధమైన చర్యలే తీసుకున్నారని వైకాపా నేతలు స్పష్టం చేశారు. సబ్బం హరికి అధికారులు నోటీసులు కూడా ఇచ్చారని మంత్రి బొత్స వెల్లడించారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకోవటం వల్లే అధికారులు చర్యలు తీసుకున్నారని తెలిపారు.

మాజీ ఎంపీ సబ్బం హరి ప్రభుత్వ భూమిని ఆక్రమించారు
మాజీ ఎంపీ సబ్బం హరి ప్రభుత్వ భూమిని ఆక్రమించారు

By

Published : Oct 4, 2020, 6:52 PM IST

మాజీ ఎంపీ సబ్బం హరి ప్రభుత్వ భూమిని ఆక్రమించారు

విశాఖలో మాజీ ఎంపీ సబ్బం హరి ఇంటి విషయంలో జీవీఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చారని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. కనీసం నోటీస్ కూడా తీసుకోకుండా అధికారులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాటం సరికాదన్నారు. సబ్బంహరి మాటలు బాధ కలిగించేలా ఉన్నాయని, మాట తీరు మార్చుకోవాలని హితవు పలికారు.

చట్టబద్ధమైన చర్యలే...

సబ్బం హరి నివాసంపై జీవీఎంసీ అధికారులు చట్టబద్ధమైన చర్యలే తీసుకున్నారని వైకాపా ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. సబ్బం నివాసం ఉంటున్న ప్రాంగణంలో జీవీఎంసీకి చెందిన భూమి 200గజాలు...ఆయన ఆధీనంలో ఉందన్నారు. ఏపీఎస్బీ కాలనీ వాసులు ఫిర్యాదుతో జీవీఎంసీ స్పందించిందని అమర్నాథ్ స్పష్టం చేశారు.

ప్రభుత్వాన్ని నిందిచాలని...

ప్రభుత్వాన్ని నిందించాలని..,కుట్రపూరిత ప్రయత్నాలు చేస్తే ఎవర్ని వదలిపెట్టమని వైకాపా ఎమ్మెల్యే జోగి రమేశ్ హెచ్చరించారు. విశాఖలో ప్రభుత్వ భూమిని సబ్బం హరి ఆక్రమించుకోవటం వల్లే అధికారులు చర్యలు తీసుకున్నారని వ్యాఖ్యానించారు. ప్రజాధనం దోచుకున్న ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు.

ఇదీ చదవండి:

తెదేపా అధికార ప్రతినిధి పట్టాభి కారు ధ్వంసం

ABOUT THE AUTHOR

...view details