ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెదేపా కార్యాలయంలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం - విశాఖ తెదేపా కార్యాలయంలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం వార్తలు

ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని విశాఖ తెదేపా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. అరకు పార్లమెంటరీ నియోజక వర్గ పరిధిలోని గిరిజనులు, ఆదివాసీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

World Tribal Day is celebrated at Visakha Tdp office
విశాఖ తెదేపా కార్యాలయంలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

By

Published : Aug 9, 2021, 8:26 PM IST

విశాఖ తెదేపా కార్యాలయంలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని విశాఖ తెదేపా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. అరకు పార్లమెంటరీ నియోజక వర్గ పరిధిలోని గిరిజనులు, ఆదివాసీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గిరిజనులతో కలిసి మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, కిడారి శ్రవణ్, బండారు సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి సాంప్రదాయ నృత్యం చేశారు.

ఉత్తరాంధ్రలో సహజ వనరులను దోచుకుపోతుంటే ఈ ప్రాంత సీనియర్ నేతలు ప్రశ్నించే ధైర్యం చేయడం లేదని అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. పట్టపగలు భారీ యంత్రాలతో గనులు కొల్లగొడుతున్నా.. నోరుమెదిపే ప్రయత్నం చేయడం లేదని ఆరోపించారు. పార్టీలకు అతీతంగా ఉత్తరాంధ్రను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు.

రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ ఆక్షేపించారు. గిరిజనుల హక్కులు హరిస్తూ వారికి ఇబ్బంది కలిగిస్తున్నారని మండిపడ్డారు. గిరిజన ప్రాంతాల్లో కనీస వైద్య సౌకర్యాలు కూడా కల్పించటం లేదన్నారు. ఈ కాలంలోనూ గిరి పుత్రులు డోలీల్లో ఆసుపత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

CM Jagan: ఉపాధి పనులతో.. వక్ఫ్ భూముల చుట్టూ సరిహద్దు గోడల నిర్మాణం: సీఎం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details