'సైబర్ వ్యవస్థలో మహిళల భద్రత' అంశంపై విశాఖలో ప్రత్యేక సదస్సు జరిగింది. ఆంధ్రా విశ్వవిద్యాలయ కన్వెన్షన్ సెంటర్ ఇందుకు వేదికైంది. హోం మంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతం సవాంగ్ సమావేశాన్ని ప్రారంభించారు. పోలీసు ఉన్నతాధికారులతో పాటు భారీ సంఖ్యలో విద్యార్థినులు హాజరయ్యారు. మహిళా భధ్రతే తమ ప్రభుత్వ లక్ష్యమని హోంమంత్రి సుచరిత చెప్పారు. సమాజంలో మహిళల రక్షణకు మహిళా మిత్ర వంటి కార్యక్రమాలు చేస్తున్నామన్నారు.
సైబర్ వ్యవస్థలో మహిళల భద్రతపై.. విశాఖలో సదస్సు - విశాఖలో 'సైబర్ వ్యవస్తలో మహిళల భద్రత సదస్సు
విశాఖ ఆంధ్రా వర్శిటీ కన్వెన్షన్ సెంటర్లో సైబర్ వ్యవస్థలో మహిళల భద్రతపై సదస్సు నిర్వహించారు. హోంమంత్రి సుచరితో పాటు డీజీపీ సవాంగ్ హాజరయ్యారు.
విశాఖలో 'సైబర్ వ్యవస్తలో మహిళల భద్రత సదస్సు'
పోలీస్ వ్యవస్థ అండగా ఉంటుంది: డీజీపీ
సైబర్ వ్యవస్థ వల్ల మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్నారని డీజీపీ గౌతం సవాంగ్ అన్నారు. అలాంటి సమయంలో వారికి పోలీస్ వ్యవస్థ అండగా ఉంటుందని తెలిపారు. పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండా కేవలం ఒక సందేశంతో ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. సమాజంలో మహిల రక్షణ కోసం పోలీస్ వ్యవస్థ కృషి చేస్తోందని స్పష్టం చేశారు.