ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రైల్వే ట్రాక్ వద్ద గోడ నిర్మాణం వద్దంటూ ఆందోళన - కంచరపాలెం రైల్వే ట్రాక్ వద్ద మహిళల నిరసన వార్తలు

రైల్వే ట్రాక్ వద్ద గోడను నిర్మించవద్దంటూ విశాఖ కంచరపాలెం రామ్మూర్తి పంతులుపేటలో మహిళలు ఆందోళన చేపట్టారు.

women protest in kancharapalem vizag district
రైల్వేట్రాక్ వద్ద గోడ నిర్మాణం వద్దంటూ ఆందోళన

By

Published : Oct 10, 2020, 6:36 PM IST

విశాఖ కంచరపాలెం రామ్మూర్తి పంతులుపేట రైల్వే ట్రాక్ వద్ద మహిళలు ఆందోళన చేపట్టారు. ఎన్నో ఏళ్లుగా అక్కడ నివసిస్తున్న వారంతా నిత్యం ట్రాక్ దాటి తమ విధులకు, నిత్యావసరాల కొనుగోలుకు వెళ్తుంటారు.

అయితే.. ఇవాళ ఉదయం నుంచి రైల్వే అధికారులు ట్రాక్​పై నుంచి రాకపోకలు నిషేధించారు. అక్కడ గోడ నిర్మిస్తున్నారు. ఆ ప్రాంత వాసులంతా గోడ నిర్మాణం ఆపేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details