విశాఖలోని థాంసన్ స్ట్రీట్ వద్ద ఓ యువతిపై శ్రీకాంత్ అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. సచివాలయంలో వాలంటీర్‌గా పనిచేస్తున్న యువతి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో గొంతు కోశాడు. అనంతరం తనకు తాను గాయపరుచుకున్నాడు. తీవ్రంగా గాయపడిన యువతి, యువకుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలిని 25వ వార్డుకు చెందిన ఉమెన్ ప్రొటెక్షన్ సిబ్బంది పరిశీలించారు. బాధిత యువతి ఇంటిలో చాలా చోట్ల రక్తపు మరకలు ఉన్నట్లు గుర్తించామని ఉమెన్ ప్రొటెక్షన్ సెక్రటరీ హేబా అంజూమ్ తెలిపారు. బాధిత యువతి అందరితో స్నేహంగా మెలిగేదని...ఆమెపై ఇంత దారుణంగా దాడి జరగడాన్ని జీర్ణించుకోలేక పోతున్నామని చెప్పారు.
'యువతి గది నిండా రక్తపు మరకలు ఉన్నాయి' - విశాఖలో యువతిపై దాడి వార్తలు
విశాఖ యువతిపై ప్రేమోన్మాది దాడి చేసి గొంతు కోశాడు. ఘటనా స్థలిని ఉమెన్ ప్రొటెక్షన్ సిబ్బంది పరిశీలించారు. బాధిత యువతి ఇంటిలో చాలా చోట్ల రక్తపు మరకలు ఉన్నట్లు గుర్తించామని ఉమెన్ ప్రొటెక్షన్ సెక్రటరీ హేబా అంజూమ్ తెలిపారు.

girl attacked in vizag