ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Farmers Protest: 'జీడిమామిడి తోటలు తొలగిస్తే... ఆత్మహత్యలే శరణ్యం' - విశాఖ జిల్లా లేటెస్ట్ అప్​డేట్స్

Cashew mango: జీడిమామిడి తోటలను తొలగిస్తే మాకు ఆత్మహత్యే దిక్కని మాడుగులలో మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మామిడి కొమ్మలకు చీరలతో ఉరి వేసుకున్నట్లుగా వినూత్నంగా నిరసన తెలిపారు. తాము ఆక్రమణదారులం కాదని.. ప్రభుత్వమే భూములు ఇచ్చిందని స్పష్టం చేశారు.

Cashew mango
జీడిమామిడి తోటలను తొలగించొద్దని మహిళా రైతుల వినూత్న నిరసన

By

Published : Apr 8, 2022, 8:20 AM IST

Cashew mango: విశాఖ జిల్లా మాడుగుల రెవెన్యూ పరిధిలోని ఉరవకొండపై జీడిమామిడి తోటలను తొలగిస్తే ఆత్మహత్యలే శరణ్యమని మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం మామిడి చెట్ల కొమ్మలకు చీరలతో ఉరి వేసుకున్నట్లు వినూత్నంగా నిరసన తెలిపారు.

"మేము ఆక్రమణదారులం కాదు. జీడి తోటలపై ఆధారపడి జీవిస్తున్నాం. డీ పట్టా భూములను ప్రభుత్వమే ఇచ్చింది. ఎమ్మెల్యే, తహసీల్దారు గిరిజనులపై వివక్ష చూపడంతో భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి" -మహిళా రైతులు

ఇదీ చదవండి:ప్రసవాలు చేశారు.. వసతులు మరిచారు..

ABOUT THE AUTHOR

...view details