ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Woman Complaint: చనిపోయినట్లు పత్రాలు సృష్టించి.. ఆస్తిని కాజేసి - విశాఖలో కలెక్టర్‌కు వృద్ధురాలు ఫిర్యాదు

Woman Complaint: ఆమెకు పిల్లలు లేకపోవడంతో చెల్లెలు కుమారుడిని పెంచుకుంటూ జీవనం సాగిస్తోంది. అయితే ఆమెకున్న ఆస్తి మీద ఆ కొడుకు కన్నేశాడు. తల్లి చనిపోయిందని నకిలీ పత్రాలు సృష్టించి ఆస్తిని కాజేసి ఆమెను ఇంటి నుంచి తరిమేశాడు. దీంతో 82 ఏళ్ల వృద్ధురాలు కలెక్టర్​ను ఆశ్రయించింది. ఈ హృదయ విదారక ఘటన విశాఖలో చోటు చేసుకుంది.

Woman Complaint to collector
ఆస్తిని కాజేశారని కలెక్టర్‌కు వృద్ధురాలు ఫిర్యాదు

By

Published : Mar 22, 2022, 7:38 AM IST

Woman Complaint: తాను బతికుండగానే చనిపోయినట్టు ద్రువీకరించి, తన భర్త కష్టార్జితంగా వచ్చిన ఆస్తిని పెంచుకున్న కుమారుడు కాజేశారని విశాఖలో 82 ఏళ్ళ వృద్ధురాలు కలెక్టర్‌ను ఆశ్రయించింది. కాన్సర్ వ్యాధితో అనారోగ్యంతో బాధపడుతున్నా తన ప్రమేయం లేకుండా ఉన్న మీసాల శంకరరావు, మీసాల వెంకట్రాజు అనే వ్యక్తులు ఆస్తిని కాజేశారని రెండో పట్టణ పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేసినా స్పందించలేదని మొర పెట్టుకున్నారు.

ఆస్తిని కాజేశారని కలెక్టర్‌కు వృద్ధురాలు ఫిర్యాదు

విశాఖలో సూర్యభాగ్‌లో 82 ఏళ్ల తులసి నివాసం ఉంటుంది. ఈమెకు ఇద్దరు ఆడపిల్లలు కావడంతో చెల్లెలు కుమారుడు మీసాల శంకరరావుని పెంచుకుంటూ జీవన సాగించింది. అయితే ఆ పెంచుకున్న కొడుకే బ్రతికుండగానే తులసి చనిపోయిందని ఆధారాలను సృష్టించి 96 గజాల స్థలాన్ని కాజేసి, ఆమెను ఇంటి నుంచి తరిమేశాడని వాపోయారు.

ABOUT THE AUTHOR

...view details