ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నమ్మించి.. కోటి రూపాయలు వసూలు చేసి.. ఆపై - చీటీలు పేరుతో మోసం మహిళ నిర్బంధం

Woman cheating Villagers: కష్టపడి సంపాదించడం చేతగాక కొంతమంది నమ్మించి మోసం చేస్తుంటారు. పిల్లల చదువుల కోసం, పెళ్లిళ్ల కోసం దాచుకున్న వారిని చిట్టీల పేరుతో మోసం చేసి.. సొమ్మంతా దోచుకుని ఉడాయిస్తుంటారు. ఇలాంటి ఘటనే పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం శివిని గ్రామంలో జరిగింది. అయితే చివరకు ఓ ట్విస్ట్​ జరిగింది.. అది ఏంటంటే..

Woman cheating
Woman cheating

By

Published : Jun 4, 2022, 5:47 PM IST

Updated : Jun 4, 2022, 8:27 PM IST

Woman cheating Villagers:పెళ్లో..పేరంటమో.. ఆసుపత్రికో,అనారోగ్య ఖర్చులకో.. ఇతరత్రా మరేదైనా అవసరం కోసమో పెద్ద మొత్తంలో డబ్బు కావల్సి వచ్చిందనుకోండి. ఎవరైనా ఏం చేస్తారు. బ్యాంకు ఖాతాలో నిల్వ ఉంటే వెచ్చిస్తారు.. లేదా తెలిసిన వారి దగ్గర అప్పు చేస్తారు. కొంతమంది కడుతున్న చిట్టీలు పాడి...ఆ డబ్బుతో అవసరాలను తీర్చుకుంటారు కదా..

పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం శివిని గ్రామస్థులు కొందరు ఇలాగే చేశారు. పేద, రోజూవారి కూలీలు, ఇతరత్రా చిన్నా చితకా పనిచేసుకునే వారంతా ఎవరికి వారు పైసా పైసా పోగేసుకున్నారు. తమ వద్దే ఉంటే ఖర్చైపోతాయని భావించారు. నెలకింత దాచుకున్న నాలుగురాళ్లు.. ఒకేసారి పెద్ద మొత్తంలో చేతికి వస్తే బాగుంటుందని ఆశపడ్డారు. వారి ఈ అవసరమే ఆమెకు కలిసొచ్చింది. అదే గ్రామానికి చెందిన ఓ మహిళ... ఊరి వారందరికీ తాను చిట్టీల వ్యాపారం మొదలు పెడుతున్నానని చెప్పింది. తన దగ్గర చిట్టీలు వేసి.. కావల్సివచ్చినపుడు తీసుకోమని చెప్పింది.

తమ ఊరి మనిషే కదా అని అంతా నమ్మారు. కష్టపడి దాచుకున్న రూపాయిని ఆమెకు నెలనెలా క్రమం తప్పకుండా చెల్లించారు. అవసరానికి పెద్ద మొత్తంలో నగదు అందుతుందని సంతోషించారు. ఆమె కూడా కొంతకాలం క్రమం తప్పకుండా చిట్టీ డబ్బులు ఎప్పటికప్పుడు చెల్లించేది. అవసరాలు తీరడంతో వారూ ఆనందించేవారు. దీంతో గ్రామస్థులకు నమ్మకం మరింత పెరిగింది. ఒక్కొక్కరుగా చేరినవారు పదుల సంఖ్యలో తమకు తెలిసిన వారితో కూడా చిట్టీలు కట్టించారు.

వందలు, వేలు, లక్షల నుంచి కోటి రూపాయలకు చేరింది ఆ మహిళ చిట్టీల వ్యాపారం. ఇంకేముంది...అంత డబ్బు చూడగానే దుర్భుద్ధి నిద్రలేచింది. సాధారణ స్థాయి నుంచి కోటీశ్వరురాలినవ్వాలన్న దురాలోచన వచ్చిందేమో... అంతే చిట్టీ పాడిన వారికి చెల్లించడం మానేసింది. రేపు, మాపు అంటూ...దాటవేసింది. ఇస్తుందిలే..ఎక్కడికి పోతుందని తొలుత అంతా భావించారు. సొమ్ము చేతికందలేదని... అవసరాలు ఆగవు కదా !! దీంతో ఎంతకీ ఆమె చెల్లించకపోవడంతో చిట్టీ వేసిన వారు పదే పదే అడగడం ప్రారంభించారు. అయినా ఆమె తీరులో మార్పు రాలేదు. ఎన్నిసార్లు అడిగినా అదే సమాధానం... అప్పుడిస్తా...ఇప్పుడిస్తానని. కానీ.. ఇచ్చేది మాత్రం కాదు. చివరికి వ్యవహారమేదో తేడా కొడుతోందని బాధితులు గ్రహించారు. అంతా కలిసి పోలీసు స్టేషన్​లో ఆ మహిళపై ఫిర్యాదు చేశారు. రెక్కలు ముక్కలు చేసుకుని కూడబెట్టుకున్న సొమ్ము ఇప్పించాలని కోరారు. పోలీసులకు భయపడి చిట్టీ డబ్బులు ఇస్తుందేమోనని ఎదురు చూశారు. కానీ ఫలితం మాత్రం శూన్యం.

ఓ పక్క పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, మరో వైపు చిట్టీ డబ్బులు చేతికి అందకపోవడంతో గ్రామ ప్రజలు విసిగిపోయారు. వారి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో ఆ మహిళను అంతా కలిసి తాళ్లతో గ్రామంలోని స్తంభానికి కట్టేశారు. ఆమెతో తమ సొమ్ము గురించి వాగ్వాదానికి దిగారు. మహిళను కట్టేశారన్న విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని.. ఆమెను విడిపించారు. అనంతరం స్టేషన్​కు తరలించి వాకబు చేశారు. కూలీనాలీ చేసుకుని కష్టపడి కట్టిన తమ సొమ్మును ఎలాగైనా తిరిగి తమకు చెల్లించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.

నమ్మించి.. కోటి రూపాయలు వసూలు చేసి.. ఆపై

ఇవీ చదవండి :

Last Updated : Jun 4, 2022, 8:27 PM IST

ABOUT THE AUTHOR

...view details