విశాఖలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్‌లో భారీ క్రేన్ కూలిన ప్రమాదంలో చనిపోయినవారి కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇవ్వడంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని యాజమాన్యం ప్రకటించింది. బాధిత కుటుంబాలు తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగడంతో ఏపీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వారితో చర్చలు జరిపారు.
డబ్బులిస్తే నా కుమారుడు వస్తాడా..? మృతుడి తల్లి ఆవేదన - crane accident in visakha latest news
విశాఖ హిందుస్థాన్ షిప్‌యార్డ్ వద్ద బాధిత బంధువులు ఆందోళన చేపట్టారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు... సంస్థ అధికారులతో చర్చించడానికి వచ్చాడని తెలిసి అక్కడికి చేరుకున్నారు. మంత్రికి తమగోడు వెళ్లబోసుకున్నారు. పరిహారం చెల్లిస్తే... తమ కుమారుడు తిరిగి వస్తాడా..? అంటూ ఓ తల్లి కన్నీటిపర్యంతమైంది.
బాధిత బంధువులు ఆందోళన