ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో మూడురోజులపాటు తేలికపాటి జల్లులకు అవకాశం - రాష్ట్రంలో వాతావరణం

రాబోయే మూడు రోజుల్లో.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది. ఆగ్నేయ, దక్షిణ గాలుల ప్రభావంతో కొన్ని మార్పులు చోటుచేసుకున్నట్లు వెల్లడించింది.

light rains in state, three days light rains in ap for three days
రాష్ట్రంలో వాతావరణం, మూడురోజులపాటు రాష్ట్రంలో చిరుజల్లులు

By

Published : Apr 13, 2021, 12:35 AM IST

రాష్ట్రంలో ఆగ్నేయ, దక్షిణ గాలులు తక్కువ ఎత్తులో వీస్తున్నాయి. ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాంలోని కొన్ని చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. దక్షిణ కోస్తా ఆంధ్రలో ఈరోజు, రేపు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఎల్లుండి ఒకటి లేదా రెండు చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురవవచ్చని అంచనా వేసింది.

ఇదీ చదవండి:మహారాష్ట్రలో మరో 51వేల కరోనా కేసులు

రాయలసీమలో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఒకటి, రెండు చోట్ల రేపు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురవవచ్చని హెచ్చ‌రించింది. ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక పాటి జల్లులు పడవచ్చని తెలిపింది.

ఇదీ చదవండి:

హైడ్రోకార్బన్ బావుల తవ్వకాలపై.. ప్రజాభిప్రాయసేకరణ

ABOUT THE AUTHOR

...view details