యానాంలో అత్యధికంగా 25 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. అమలాపురం-19, తణుకు-19, నూజివీడు-19, తాడేపల్లిగూడెం-18, విజయవాడ-16, భీమిలి-16, కైకలూరు-14, పలాస-15, ఇచ్ఛాపురం-15, తిరువూరు-15, యలమంచిలి-14, చింతలపుడి, సోంపేట, గుడివాడ, మందస-13, నర్సాపురం, కాకినాడ, పత్తిపాడు, కొయ్యలగూడెం, పాలకోడేరు, భీమవరం-12, పెద్దాపురం, భీమడోలు, నర్సీపట్నం, ఏలూరు-11, తుని-10, నందిగామ, అనకాపల్లి, చోడవరం, వేపాడ-9, విశాఖపట్నం, తెర్లాం, పాడేరు, కుక్కునూరు, పూసపాటి రేగ-8, పాలకొండ, వేలేర్పాడు, డెంకాడ, రణస్థలం, పార్వతీపురం, మంగళగిరి, కళింగపట్నం, కూనవరం-7 సెంటిమీటర్ల మేర వర్షపాతం నమోదైంది.
బలహీనపడుతున్న తీవ్రవాయుగుండం - పశ్చిమమధ్య బంగాళాఖాతంలో వాయుగుండం వార్తలు
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రవాయుగుండం మంగళవారం ఉదయం కాకినాడ సమీపంలో తీరం దాటినట్లు వాతావరణశాఖ శాస్త్రవేత్తలు ప్రకటించారు. అది పశ్చిమ వాయువ్య దిశగా పయనించి ఉదయం 11.30కు తెలంగాణ వైపు వెళ్లింది. ఇది క్రమంగా బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారుతుందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో బుధవారం మహారాష్ట్ర, ఉత్తర-దక్షిణ కొంకణ్, గోవా, కర్ణాటక ప్రాంతాల్లో భారీ వర్షాలుంటాయని హెచ్చరించారు. ప్రత్యేకించి మహారాష్ట్ర, కొంకణ్, గోవాలో కొన్నిచోట్ల 20 సెం.మీ.లకు పైబడి భారీ వర్షాలు కురిసే అవకాశముంది.
http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/13-October-2020/9154695_450_9154695_1602602722108.png
Last Updated : Oct 14, 2020, 6:19 AM IST