ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు! - Weather news

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి కారణంగా... రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది.

WEATHER CONDITION UPDATES IN STATE
రాష్ట్రంలోని పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం

By

Published : Feb 20, 2021, 5:59 PM IST

Updated : Feb 21, 2021, 11:50 AM IST

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. ఉత్తర తమిళనాడు తీరం నుంచి దక్షిణ ఒడిశా వరకు ఒకటిన్నర కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. దీని ప్రభావం వల్ల ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి, రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది. దక్షిణ కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖాధికారి శ్రీకాంత్ వివరించారు. రాయలసీమలోనూ ఈరకంగానే ఉంటుందని తెలిపారు.

వాతావరణశాఖాధికారి శ్రీకాంత్
Last Updated : Feb 21, 2021, 11:50 AM IST

ABOUT THE AUTHOR

...view details