దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విశాఖ జిల్లా సింహాచలం సింహాద్రి అప్పన్న సన్నిధిలో నేడు స్వామివారి ఆయుధాలకు పూజ నిర్వహించారు. విజయ దశమి రోజున స్వామివారి పూలతోటలో జమ్మి వట జరగనుంది. ఈ మహోత్సవంలో స్వామివారు ఈ ఆయుధాలను ధరించి పూలతోటలో విహరిస్తారు. ఈ వేడుకలో భాగంగా ఆలయంలోని స్వామి వారి ఆయుధాలను బయటికి తీసి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేడు మూలా నక్షత్రం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పూజలో పాల్గొన్నారు.
Simhachalam Temple : అప్పన్న ఆలయంలో ఆయుధపూజ - సింహాచలం ఆలయం వార్తలు
విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న సన్నిధిలో నేడు శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్వామి ఆయుధాలకు పూజ నిర్వహించారు.
అప్పన్న ఆలయంలో ఆయుధపూజ
స్థానాచార్యులు శ్రీమాన్ రాజగోపాల్ అలంకారీ పురోహితులు సీతారామాచార్యులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ధర్మ కర్తల మండలి సభ్యులు వారణాసి దినేష్ రాజ్, సూరిబాబు పాల్గొన్నారు.
ఇదీ చదవండి : Sharada Peetam : విశాఖ శారదాపీఠంలో మహా సరస్వతిగా రాజశ్యామల దేవి