ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖ శారదా పీఠంలో ఆయుధ పూజ...పాల్గొన్న మంత్రి అవంతి - విశాఖ శారదా పీఠంలో ఆయుధ పూజ తాజా వార్తలు

విశాఖ శారదా పీఠంలో ఆయుధ పూజ నిర్వహించారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్రలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అవంతి శ్రీనివాస్ పాల్గొన్నారు.

విశాఖ శారదా పీఠంలో ఆయుధ పూజ
విశాఖ శారదా పీఠంలో ఆయుధ పూజ

By

Published : Oct 25, 2020, 2:18 PM IST

విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని విశాఖ శారదా పీఠంలో ఆయుధ పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అవంతి శ్రీనివాస్ పాల్గొన్నారు. పీఠం ప్రాంగణంలోని శమీవృక్షం వద్ద శాస్త్రోక్తంగా పూజ నిర్వహించారు. నవరాత్రుల్లో అమ్మవారి అవతారాల కోసం వినియోగించిన సామాగ్రి, ఆయుధాలను పూజలో ఉంచారు. వేద ఘోష నడుమ పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర పూజలు నిర్వహించారు.

అనంతరం లోక కల్యాణార్థం శారదాపీఠంలో చేపట్టిన చండీయాగం పూర్ణాహుతిలో పీఠాధిపతులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకు శక్తిసామర్థ్యాలు ప్రసాదించమని ఆ రాజ్య శ్యామల అమ్మవారిని వేడుకున్నాని మంత్రి అవంతి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details