ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కోలుకున్నాక నిందితుడిని కస్టడీలోకి తీసుకుంటాం: డీసీపీ - DCP rastogi latest news

విశాఖలో యువతిపై దాడి ఘటనలో దర్యాప్తు జరుగుతోందని డీసీపీ ఐశ్వర్య రస్తోగి తెలిపారు. ఆస్పత్రిలో కోలుకున్నాక నిందితుడిని కస్టడీలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. నిందితుడి నుంచి మరిన్ని వివరాలు సేకరిస్తామన్నారు.

We will take the accused into custody after recovery: DCP
డీసీపీ ఐశ్వర్య రస్తోగి

By

Published : Dec 2, 2020, 5:45 PM IST

విశాఖ ఘటన బాధితురాలికి చికిత్స కొనసాగుతోందని డీసీపీ రస్తోగి చెప్పారు. ఆమె విశాఖ కేజీహెచ్​లో చికిత్స పొందుతోందని వివరించారు. గతంలో నిందితుడు, బాధితురాలి పెళ్లి విషయమై ఇరు కుటుంబాల్లో చర్చలు జరిగాయని... కాని బాధితురాలి కుటుంబసభ్యులు పెళ్లికి నిరాకరించారన్నారు. అప్పటి నుంచి నిందితుడు కోపం పెంచుకున్నాడని.. ఆమెపై అనుమానంతో ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు గుర్తించామని చెప్పారు.

డీసీపీ ఐశ్వర్య రస్తోగి

ఈ ఘటనలో పోలీస్ శాఖ వెంటనే స్పందించి... 307, 452, 354, 309 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిందని తెలిపారు. ఆ వెంటనే దర్యాప్తు ప్రారంభించామన్నారు. ఘటనపై ఆధారాలు సేకరించామని... ఈ కేసుకు సంబంధించి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విశాఖ నగరంలో అవగాహన కార్యక్రమలు నిర్వహిస్తున్నామని చెప్పారు. విద్యాలయాలకు వెళ్లి యువతలో చైతన్యం కల్పిస్తున్నామని వివరించారు. దిశ యాప్‌పై అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఎలాంటి సమస్యలున్నా తల్లిదండ్రులు పోలీసులను సంప్రదించాలని డీసీపీ సూచించారు.

ABOUT THE AUTHOR

...view details