ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మా ట్రస్టు ద్వారా మౌలిక సదుపాయాలు కల్పిస్తాం: విజయసాయిరెడ్డి - Vijayasai Reddy

తన ట్రస్టు ద్వారా మౌలిక సదుపాయాలు, మంచి నీరు, రోడ్లు, కాలువలు, కమ్యూనిటీ భవన సౌకర్యం కల్పిస్తామని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖ ప్రజలకు హామీ ఇచ్చారు. సీతమ్మధార మురికివాడల్లో పర్యటించిన ఆయన... స్థానికుల సమస్యలు తెలుసుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా ఇళ్ల పట్టాలు మార్చి 15 తరువాత ఇప్పిస్తామని చెప్పారు.

మా ట్రస్టు ద్వారా మౌలిక సదుపాయాలు కల్పిస్తాం: విజయసాయిరెడ్డి
మా ట్రస్టు ద్వారా మౌలిక సదుపాయాలు కల్పిస్తాం: విజయసాయిరెడ్డి

By

Published : Feb 18, 2021, 5:15 PM IST

తన ట్రస్టు ద్వారా మౌలిక సదుపాయాలు, మంచి నీరు, రోడ్లు, కాలువలు, కమ్యూనిటీ భవనాల సౌకర్యం కల్పిస్తామని రాజ్యసభ సభ్యులు, వైకాపా కీలక నేత విజయసాయిరెడ్డి విశాఖ సీతమ్మధార ప్రజలకు హామీ ఇచ్చారు. విశాఖలోని పలు వార్డుల్లో విజయసాయి పర్యటించారు. సీతమ్మధార మురికివాడల్లో తిరిగారు.

స్థానిక సమస్యలు తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధులు అందరం సీతమ్మధారలోని మురికివాడల్లో పర్యటించి సమస్యలు తెలుసుకుంటున్నామని పేర్కొన్నారు. ముస్లిం సోదరులకు మసీదు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా ఇళ్ల పట్టాలు మార్చి 15 తరువాత ఇప్పిస్తామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details