విశాఖను కాలుష్యరహిత నగరంగా అభివృద్ధి చేస్తామని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. గాంధీ 151వ జయంతి పురస్కరించుకుని విశాఖలో స్వచ్ఛ మహోత్సవ్‌ను ఘనంగా నిర్వహించారు. గురజాడ కళాక్షేత్రం వేదికగా జరిగిన ఈ వేడుకలో ఎంపీ విజయసాయిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
విశాఖను కాలుష్యరహితంగా తీర్చిదిద్దుతాం: విజయసాయిరెడ్డి - vishaka swach mahostav 2020 news
విశాఖను కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. ప్రజలందరూ పరిసరాలు పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. విశాఖ కార్యనిర్వాహక రాజధానిగా మారితే...మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు.
mp vijaya sai reddy
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన స్వచ్ఛ్ భారత్ పథకంపై ఆయన ప్రశంసలు కురిపించారు. మరోవైపు రాష్ట్ర కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ మారబోతోందని ఆయన తెలిపారు. దీనివల్ల విశాఖ మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. స్వచ్ఛ మహోత్సవ్ 2020 అవార్డు గ్రహీతలకు పురస్కారాలను ఎంపీ విజయసాయి రెడ్డి అందించారు.