విశాఖలోని కొవిడ్ ఆసుపత్రి విమ్స్‌లో వైద్య సదుపాయాలు పూర్తి స్థాయిలో మెరుగు పరుస్తామని మంత్రి అవంతి శ్రీనివాసరావు వెల్లడించారు. విమ్స్‌లో కరోనా బాధితులను వైద్య సిబ్బంది పట్టించుకోవటం లేదని వార్తలు రావటంతో.. ఆసుపత్రిని మంత్రి అవంతి సోమవారం సందర్శించారు. సమస్యలు అధికారులను అడిగి తెలుసుకున్నారు.
విమ్స్‌లో కొన్ని లోపాలున్నాయని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. సిబ్బంది నియామకానికి సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చామని తెలిపారు. కొవిడ్ విధులు నిర్వహించేందుకు వైద్య సిబ్బంది ముందుకు రావట్లేదని చెప్పారు. అలాగే విమ్స్‌లో సమన్వయలోపంపై సంయుక్త కలెక్టర్ అరుణ్‌కుమార్ ఆధ్వర్యంలో విచారణ కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కొవిడ్ బాధితుల బంధువులకు, వైద్యులకు మధ్య సమాచార లోపం లేకుండా అందుబాటులో ఇద్దరు వైద్యులను ఉంచుతున్నట్లు వెల్లడించారు.