ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జీవీఎంసీని సీఎంకు కానుకగా ఇవ్వాలి: మంత్రి అవంతి - local body elections in ap

వచ్చే విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైకాపా విజయభేరీ మోగించేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని మంత్రి అవంతి సూచించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు.

we should be given GVMC as a gift to CM: Minister Avanti says to ycp followers
we should be given GVMC as a gift to CM: Minister Avanti says to ycp followers

By

Published : Jan 29, 2020, 11:04 PM IST

రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో మేయర్ పీఠంతో సహా జీవీఎంసీలోని అన్ని వార్డులను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సూచించారు. బుధవారం విశాఖలో జీవీఎంసీ ఎన్నికల కసరత్తు పై నగర పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలతో మంత్రి సమావేశం నిర్వహించారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్​మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాలు ప్రజలందరికీ అందేలా చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. అభివృద్ధి పథకాల ఫలాలు జీవీఎంసీ ఎన్నికల్లో పార్టీకి లభిస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని వార్డులను గెలుచుకుని జీవీఎంసీని ముఖ్యమంత్రికి కానుకగా ఇవ్వాలని అన్నారు.

మంత్రి అవంతి ప్రసంగం

ABOUT THE AUTHOR

...view details