ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'పన్నుల నుంచి 6 నెలలు మినహాయింపు ఇవ్వాలి' - ఏపీ కరోనా అప్​డేట్స్

కరోనా ప్రభావంతో వస్త్ర పరిశ్రమ తీవ్రంగా దెబ్బతిందని రాష్ట్రంలోని వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. ఏటా వేల కోట్ల టర్నోవర్‌ చేసే సామర్థ్యమున్న మార్కెట్‌.... లాక్‌డౌన్‌తో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోందని వాపోతున్నారు. సిబ్బందికి జీతభత్యాలు చెల్లించాలంటే కష్టంగా ఉందని అంటున్నారు.

we-need-6-months-exemption-from-taxes-says-textile-industry-representatives
we-need-6-months-exemption-from-taxes-says-textile-industry-representatives

By

Published : Apr 27, 2020, 8:09 PM IST

లాక్​డౌన్ కారణంగా రిటైల్ వ్యాపార రంగం... ప్రత్యేకంగా వస్త్ర వ్యాపారం పూర్తిగా కుదేలైంది. ఈ పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని వస్త్ర పరిశ్రమ ప్రతినిధులు కోరుతున్నారు. బంగారం, వస్త్ర వ్యాపార మాల్స్​కు పన్నుల నుంచి 6 నెలలు మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు. అలాగే కొన్ని షరతులు, నిబంధనలతో పరిమితంగా అమ్మకాలకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వేల మంది కార్మికులు తమను నమ్ముకుని ఉన్నారని వాళ్లను ఆదుకోవడం తమ బాధ్యత అని చెబుతున్నారు. కొన్ని షరతులతో వ్యాపారానికి అనుమతివ్వాలంటున్న వస్త్ర పరిశ్రమ ప్రతినిధులు మావూరి వెంకటరమణ, కంకటాల మల్లిక్​లతో ముఖాముఖి...

వస్త్ర పరిశ్రమ ప్రతినిధులతో ముఖాముఖి

ABOUT THE AUTHOR

...view details