వేతన సవరణ చేయాలన్న డిమాండ్‌తో రెండు రోజులపాటు బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు సంఘాలన్నీ సిద్ధమయ్యాయి. ఆర్థిక సంవత్సరం ముగింపు దశలో బ్యాంకుల సమ్మె ఆర్థిక కార్యకలాపాలపైనా, ప్రభుత్వ ఆదాయంపైనా తీవ్ర ప్రభావం చూపుతుందని బ్యాంకు ఉద్యోగుల సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు.
'కేంద్రం దిగిరాకపోతే... నిరవధిక సమ్మెకు సిద్ధం' - బ్యాంకు సంఘాల ప్రకటన
బ్యాంకు ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో రెండు రోజులపాటు బ్యాంకులు మూతపడనున్నాయి. కేంద్ర దిగి వచ్చే వరకు వెనక్కు తగ్గబోమని బ్యాంకు ఉద్యోగుల సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే నిరవధిక సమ్మెకు సిద్ధమని ప్రకటించాయి.
banks strike
బ్యాంకు ఉద్యోగుల యూనియన్లు 20 శాతం హైక్‌తో వేతన సవరణ కోరుతున్నాయని... 2017 నుంచి ఈ డిమాండ్ పెండింగ్‌లో ఉందని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్స్ విశాఖ నేత సీడీబీ సుందర్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో వేతన సవరణపై తక్షణ చర్యలు చేపట్టాలనే డిమాండ్‌తోనే జనవరి 31, ఫిబ్రవరి1న సమ్మెకు వెళ్తున్నట్లు తెలిపారు. ఈ సమ్మెలో దేశంలోని అన్ని బ్యాంకులు పాల్గొంటాయని వివరించారు. కేంద్రం దిగిరాకపోతే మాత్రం నిరవధిక సమ్మెకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.