visakha ZP meeting: విశాఖ జిల్లా జెడ్పీ తొలి సర్వసభ్య సమావేశంలోనే అధికారపార్టీ ఎమ్మెల్యే, జెడ్పీటీసీ సభ్యుల మధ్య ప్రోటోకాల్‌పై వాగ్వాదం చోటుచేసుకుంది. జెడ్పీటీసీ సభ్యులకు మండల ఆఫీసుల్లో కనీసం కుర్చీలు కూడా వేయడం లేదని, మండల సర్వసభ్య సమావేశంలో మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వడం లేదని జెడ్పీ ఛైర్ పర్సన్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజు స్పందిస్తూ... జెడ్పీటీసీ సభ్యులకు మండల ఆఫీసుల్లో ఛాంబర్లు కేటాయించే పరిస్థితి లేదన్నారు. దీంతో జెడ్పీటీసీ సభ్యులు వాగ్వాదానికి దిగడంతో ఒక్కసారిగా సమావేశం వేడెక్కింది. సభ్యులకు గౌరవం లేని చోట తమకు పదవులు ఎందుకని ప్రశ్నించారు.. మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాస్ అధ్వర్యంలో ఇదంతా జరగడంతో.. ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Visakha ZP Meeting: విశాఖ జెడ్పీ సమావేశంలో రసాభాస.. ఎమ్మెల్యే వర్సెస్ జెడ్పీటీసీలు! - విశాఖ జెడ్పీ సమావేశంలో ఉద్రిక్తత
visakha ZP meeting: విశాఖ జెడ్పీ సమావేశం రసాభాసగా జరిగింది. ప్రొటోకాల్ అంశంపై అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కన్నబాబురాజు... పలువురు జెడ్పీటీసీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇదంతా మంత్రి అవంతి సమక్షంలోనే జరిగింది.
Visakha ZP Meeting:
Last Updated : Dec 19, 2021, 5:13 PM IST