ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AWARDS: తూర్పు కోస్తా రైల్వే జోన్ పనితీరు భేష్: జీఎం విద్యాభూషణ్ - తూర్పు కోస్తా రైల్వే వార్తలు

తూర్పు కోస్తా రైల్వేలో వివిధ విభాగాల్లో వాల్తేర్ డివిజన్ ఉత్తమ పనితీరు కనబరిచి అనేక అవార్డులను అందుకుంది. జోన్ ఉత్తమ పనితీరు కనబరచడంలో సిబ్బంది పాత్రను జీఎం విద్యాభూషణ్ కొనియాడారు.

తూర్పు కోస్తా రైల్వే జోన్ పనితీరు భేష్
తూర్పు కోస్తా రైల్వే జోన్ పనితీరు భేష్

By

Published : Oct 7, 2021, 8:18 PM IST

భారతీయ రైల్వేలో అత్యధిక లోడింగ్ సాధించిన జోన్​గా తూర్పు కోస్తా రైల్వే నిలవడంలో సిబ్బంది కృషి ఎనలేనిదని జోన్ జనరల్ మేనేజర్ విద్యాభూషణ్ కొనియాడారు. భువనేశ్వర్​లో నిర్వహించిన 66వ రైల్వే వారోత్సవాల కార్యక్రమంలో(WALTAIR DIVISION GOT AWARDS IN EAST COST RAILWAYS) ఆయన ఉత్తమ పని తీరు కనబరిచిన ఉద్యోగులకు ప్రశంసాప్రతాలు, వివిధ విభాగాలకు షీల్డులను ప్రదానం చేశారు.

వాల్తేర్ రైల్వే కోచింగ్, ఆర్థిక, మానవ వనరులు, తుక్కు డిస్పోజల్, సిగ్నల్ అండ్ టెలికాం, క్రీడా విభాగాలకు లభించిన షీల్డులను వాల్తేర్ డీఆర్ఎం అనూప్ కుమార్ సతపతి, ఇతర అధికారులు జీఎం విద్యాభూషణ్ చేతుల మీదుగా అందుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details