ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ'పై.. కార్మికుల ఆందోళన - విశాఖ న్యూస్ అప్​డేట్స్

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఉద్యమం మళ్లీ మొదలైంది. పరిశ్రమను ప్రైవేటీకరించాలనే కేంద్రం నిర్ణయంపై.. కార్మికులు భగ్గుమన్నారు. ప్రైవేటీకరణ యత్నాలను నిలిపేయాలనే డిమాండ్‌తో.. నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్రం తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు.

vsp steel plant rally
vsp steel plant rally

By

Published : Feb 5, 2021, 11:58 AM IST

Updated : Feb 5, 2021, 2:04 PM IST

ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ యత్నాలను నిరసిస్తూ కార్మికుల ర్యాలీ

ఉద్యమాలు, బలిదానాలు చేసి సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించాలని ఇటీవలి బడ్జెట్ సమావేశాల్లో కేంద్రం తీసుకున్న నిర్ణయంపై.. కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు ఉద్యమాన్ని పునఃప్రారంభిస్తామని హెచ్చరించిన కార్మికులు.. కేంద్రం వైఖరికి వ్యతిరేకంగా నగరవీధుల్లోకి వచ్చారు. వందల సంఖ్యలో స్టీల్‌ప్లాంట్‌ కార్మికులు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. కూర్మన్నపాలెం జంక్షన్‌ నుంచి.. జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకూ నినాదాలుచేస్తూ ముందుకు సాగారు.

ప్రైవేటీకరణ నిర్ణయం నుంచి కేంద్రం వెనక్కి తగ్గకపోతే.. ఉద్యమం మరింత ఉద్ధృతంగా సాగుతుందని.. కార్మిక సంఘాల నేతలు, నిర్వాసితులు హెచ్చరించారు. ప్రభుత్వ సంస్థగా కొనసాగుతుందనే నమ్మకంతోనే ఇందిరాగాంధీ హయాంలో భూములు ఇచ్చామని.. ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులకు ఆ విలువైన భూములు ఇస్తామంటే చూస్తూ ఊరుకోబోమని చెప్పారు.

Last Updated : Feb 5, 2021, 2:04 PM IST

ABOUT THE AUTHOR

...view details