Garbage tax: రాష్ట్రంలోని 45-60 ఏళ్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు ప్రభుత్వం ‘చేయూత’ పథకం కింద ఏడాదికి రూ.18,750 చెల్లిస్తోంది. లబ్ధిదారుల్లో 90శాతం వరకు డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్నారని అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే ఆర్నెళ్ల చెత్త సేకరణ రుసుములు చెల్లించాలని అధికారులు డ్వాక్రా సంఘాలకు ఆదేశాలు జారీ చేశారు. దీనికి పెద్దగా స్పందన రాకపోవడంతో ఇప్పుడు చేయూత పథకం వర్తించదని కొత్త నిబంధన తీసుకొచ్చారు. ‘అధికారులు మాకిచ్చిన సమాచారాన్ని మీకు చేరవేస్తున్నాం. చేయూత పథకం కావాలంటే ప్రతి ఒక్కరూ చెత్త పన్ను చెల్లించాలి’ అని ఆర్పీలు (రిసోర్స్ పర్సన్లు) శుక్రవారం డ్వాక్రా గ్రూపుల్లో వాట్సప్ వాయిస్ మేసేజ్ పంపించారు. దీనిపై మహా విశాఖ నగరపాలక సంస్థ యూసీడీ పీడీ పాపునాయుడుని వివరణ కోరగా.. రిసోర్స్ పర్సన్లు ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం తీసుకుంటున్న నేపథ్యంలో చెత్త సేకరణ ఛార్జీలు వసూలుచేసి ఆదర్శంగా నిలవాలని సూచించామన్నారు. ఛార్జీలు చెల్లించని వారికి చేయూత పథకం నిలిపివేయాలని తాము ఆదేశించలేదన్నారు. యథావిధిగా సంక్షేమ కార్యక్రమాలు అందుతాయని పేర్కొన్నారు.
Garbage tax చెత్త పన్ను చెల్లిస్తేనే చేయూత పథకం - విశాఖలో చెత్త పన్ను చెల్లించాలని డ్వాక్రా మహిళలకు వాయిస్ మెసేజ్లు
Garbage tax చెత్త సేకరణ రుసుములు చెల్లిస్తేనే డ్వాక్రా సంఘాల మహిళలకు చేయూత పథకం వర్తిస్తుందని విశాఖలో ఆర్పీలు (రిసోర్స్ పర్సన్లు) వాట్సప్ వాయిస్ మేసేజ్‌లు పంపడం కలకలం సృష్టించింది.
చెత్త పన్ను చెల్లిస్తేనే చేయూత పథకం