ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వీఎంఆర్డీఏ నూతన ప్రణాళికకు శ్రీకారం - వీఎంఆర్టీఏ నూతన ప్రణాళికకు శ్రీకారం

విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ నూతన మాస్టర్ ప్రణాళిక రూపొందించేందుకు... వీఎంఆర్డీఏ అధికారులు చర్యలు ప్రారంభించారు.

వీఎంఆర్టీఏ నూతన ప్రణాళికకు శ్రీకారం

By

Published : Nov 22, 2019, 9:59 PM IST

వీఎంఆర్డీఏ నూతన ప్రణాళికకు శ్రీకారం

విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ మాస్టర్ ప్రణాళిక కాలపరిమితి... 2021తో పూర్తవుతోంది. నూతన మాస్టర్ ప్లాన్ రూపొందించేందుకు వీఎంఆర్టీఏ అధికారులు చర్యలు చేపట్టారు. విజయనగరం జిల్లాలో 16, శ్రీకాకుళం జిల్లాలోని 11, విశాఖ జిల్లాలోని 19 మండలాలు వీఎంఆర్డీఏ పరిధిలో ఉన్నాయి. ఆయా జిల్లాలకు చెందిన జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు నూతన ప్రణాళికపై సమగ్రంగా చర్చించనున్నారు. అందరి అభిప్రాయలు పరిగణలోకి తీసుకొని వీఎంఆర్డీఏ మాస్టర్ ప్రణాళిక-2051ని రూపొందించనున్నారు. వీఎంఆర్డీఏ మాస్టర్ ప్రణాళిక-2051లో విజయనగరం జిల్లా ప్రజల అభిరుచులను కూడా పరిగణలోకి తీసుకోవాలని కలెక్టర్ హరి జవహర్ లాల్ కోరారు.

ABOUT THE AUTHOR

...view details