లేఅవుట్ల క్రమబద్ధీకరణపై వీఎంఆర్డీఏ ప్రణాళికాధికారి సాయిబాబా.. సిబ్బందికి అవగాహన కల్పించారు. విశాఖలోని పెందుర్తి ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పంచాయితీ పరిధిలో.. అనధికార లేఅవుట్లను గుర్తించాలని ఆదేశించారు. ఎల్ఆర్ఎస్ విధానంలో అనుసరించాల్సిన మార్గదర్శకాలను వివరించారు. వివిధ జీవోలను గురించి తెలియచేశారు.
లేఅవుట్ల క్రమబద్ధీకరణపై సిబ్బందికి అవగాహన - అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణకు వీఎంఆర్డీఏ ప్రణాళికాధికారి సూచనలు
విశాఖలోని పెందుర్తి పంచాయతీ పరిధిలో లేఅవుట్ల క్రమబద్ధీకరణపై సిబ్బందికి.. వీఎంఆర్డీఏ ప్రణాళికాధికారి సాయిబాబా అవగాహన కల్పించారు. ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన సదస్సులో పాల్గొని పలు సూచనలు చేశారు.
![లేఅవుట్ల క్రమబద్ధీకరణపై సిబ్బందికి అవగాహన awareness program on unauthorized layouts sorting out](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9433992-671-9433992-1604509507362.jpg)
అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణపై అవగాహన సదస్సు
TAGGED:
pendurthi mpdo office meet