విశాఖలో ప్లానిటోరియం మ్యూజియం అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తామని వీఎంఆర్డీఏ కమిషనర్ కోటేశ్వరరావు తెలిపారు. మ్యూజియం నిర్మాణ అంశాలపై ప్లానిటోరియం సామగ్రి సరఫరాదార్లు, ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్స్లతో ఆయన గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. దేశ, విదేశీ విద్యార్థులు, పర్యాటకులకు వినోదం కలిగించేలా, విజ్ఞానం అందించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో మ్యూజియానికి రూపునిస్తున్నామని దీనికి అనుగుణంగా ప్రణాళిక ఉండాలని ఆయన వివరించారు. నిర్మాణ, సాంకేతిక పరిజ్ఞానం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. సాంకేతికంగా, అవాంతరాలు లేకుండా ఆడియో, వీడియో, ఎకోస్టిక్స్ అన్ని ఉత్తమ నాణ్యతతో ఉండాలని ఆదేశించారు.
ఈ ప్లానిటోరియం నిర్మాణం ఆప్టోమెకానికల్, డిజిటల్ 3డీ, 2డీ కలయికతో 4కే ప్రొజక్షన్ విధానం అనుసరించి హైబ్రీడ్ సిస్టంతో రూపొందించనున్నారు. దాదాపు 80 కోట్ల రూపాయిల వ్యయంతో దీని నిర్మాణం జరగనుంది.