ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండీగా దేబ్ కల్యాణ్​ మహంతి - vishaka news

విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండీగా అదనపు బాధ్యతలను దేబ్ కల్యాణ్​ మహంతికి అప్పగిస్తూ కేంద్రం ఉత్తర్వలు జారీ చేసింది. శాశ్వత సీఎండీ నియామక ప్రక్రియ పూర్తి అయ్యేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

vizag steel in charge cmd appointed
విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండీగా దేబ్ కల్యాణ్​ మహంతి

By

Published : Jul 2, 2021, 2:16 AM IST



విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండీగా అదనపు బాధ్యతలను దేబ్ కల్యాణ్​ మహంతికి అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. మే 31న సీఎండీ పీకే రథ్ పదవీ విరమణ చేసిన తర్వాత కేసీ.దాస్ కు ఇంచార్జ్​ సీఎండీగా బాధ్యతలను అప్పగించారు. ఆయన కూడా జూన్ 30న పదవీ విరమణ చేయడంతో ఈసారి ఆ బాధ్యతను మహంతికి అప్పగించారు.

డైరెక్టర్ ఫైనాన్స్ వి.వేణుగోపాలరావుకు ఇంచార్జ్​ సీఎండీగా బాధ్యతలను ఇవ్వాల్సి ఉంది. ఆయన సీబీఐ ఎంక్వైరీలో ఉన్నందున ప్రభుత్వం ఆయన పేరును పక్కన పెట్టింది. విశాఖ స్టీల్ ప్లాంట్ చరిత్రలో.. 18 గంటల పాటు సీఎండీ పదవిలో ఎవరూ లేకుండా ఉండడం ఇదే ప్రథమం. జూన్ 30 న ఇంచార్జ్ పదవీ విరమణ చేయడం.. జూలై 1 మధ్యాహ్నం వరకు ఆ స్థానంలో ఎవరినీ నియమిస్తున్నట్లు ఉత్తర్వులు ఇవ్వకపోవడం వెనుక బలమైన కారణం ఏమిటన్న అంశంపై అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే మెకాన్ సీఎండీ అతుల్ భట్ ను ఉక్కు సీఎండీ పదవికి సిఫార్సు చేసింది.

ప్రభుత్వ రంగ సంస్థల ఎంపిక బోర్డ్ ఇంటర్వ్యూ ప్రక్రియ ముగిసినా.. ఈ మేరకు శాశ్వత సీఎండీ నియామక ప్రక్రియ పూర్తయ్యేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నందునే ఇంచార్జ్​ సీఎండీ ల నియామకం అవసరమవుతోంది.

ఇదీ చదవండి:

IT Hub: 'ప్రపంచ స్థాయి స్టార్టప్ హబ్​గా ఏపీ'

ABOUT THE AUTHOR

...view details