లాక్‌డౌన్‌తో అంతర్రాష్ట్ర సరిహద్దులు, జిల్లా సరిహద్దుల్లో సరకు రవాణా వాహనాలను ఎక్కడా ఆటంకాలు లేకుండా చూస్తున్నామని విశాఖ రేంజ్ డీఐజీ ఎల్.కె.వి రంగారావు తెలిపారు. ఉత్తరాంధ్ర మూడు జిల్లాల పోలీసు యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తోందన్నారు. అనవసరమైన కారణాలతో రోడ్ల పైకి వచ్చే వారిపై కేసులు పెద్ద సంఖ్యలో నమోదుచేస్తున్నట్లు ఆయన తెలిపారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించే వారి ద్విచక్ర వాహనాలపై ఎరుపు రంగు వేసి, పెట్రోల్ కూడా దొరకకుండా చూస్తామన్నారు. రెండు వారాలుగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో అన్ని చెక్ పోస్టులను పరిశీలించి లోటు పాట్లను జిల్లా ఎస్పీలు చర్చించామన్నారు. పోలీసు యంత్రాంగం తొలి సైనికులుగా కోవిడ్ పోరాటంలో అగ్రభాగాన ఉందన్నారు. స్క్రీనింగ్ టెస్ట్‌లను విధుల్లో ఉన్న పోలీసులకు కూడా చేపట్టినట్టు వివరించారు.
అనవసరంగా రోడ్డుపైకి వస్తే... పెట్రోల్ బంద్ - ఏపీ లాక్ డౌన్ వార్తలు
సరకు రవాణా వాహనాలకు ఆటంకం కలగకుండా జిల్లా, రాష్ట్ర సరిహద్దుల్లో అన్ని ఏర్పాట్లుచేసినట్లు విశాఖ రేంజ్ డీఐజీ రంగారావు తెలిపారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారి వాహనాలపై ఎరుపు రంగు వేసి, పెట్రోల్ దొరకకుండా చూస్తామన్నారు.
Vizag range Dig on lock down