విశాఖపట్నం క్రాంతినగర్ వద్ద రెండురోజుల క్రితం జరిగిన రౌడీషీటర్ వెంకటేష్ రెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు. పాత కక్షలు, ఆధిపత్య పోరులో భాగంగానే వెంకటేష్ రెడ్డిని కత్తులు, ఇనుప రాడ్లతో కొట్టి హత్య చేసినట్లు ద్వారకా జోన్ ఏసీపీ మూర్తి తెలిపారు. ఈ కేసులో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
హత్య కేసును ఛేదించిన పోలీసులు.. ఆరుగురు అరెస్టు - vizag latest news updates
విశాఖ క్రాంతినగర్‌లో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఆరుగురిని అరెస్టు చేసినట్లు ఏసీపీ మూర్తి తెలిపారు. హత్యకు ఉపయోగించిన మారణాయుధాలు, ఓ కారును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
హత్య కేసును ఛేదించిన పోలీసులు... ఆరుగురు అరెస్టు
హత్యకు గురైన వెంకటేష్ రెడ్డి, రౌడీ షీటర్ సంతోష్ రాజా గతంలో స్నేహితులు కాగా... వీరి మధ్య మనస్పర్థల కారణంగా విడిపోయి రెండు గ్రూపులుగా ఏర్పడ్డారని ఏసీపీ తెలిపారు. తరచూ రెండు గ్రూపుల మధ్య గొడవలు జరుగుతూ ఉండేవని, పథకం ప్రకారం సంతోష్ రాజా రెక్కీ నిర్వహించి వెంకటేష్‌ను హత్య చేసినట్లు వివరించారు. హత్యకు ఉపయోగించిన ఇనుప రాడ్లు, కత్తులతో పాటు కారును కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ మూర్తి తెలిపారు.
ఇదీచదవండి.