విశాఖపట్నం పోర్ట్‌ను దేశంలోనే తొలి ర్యాంకులో నిలపాలన్నదే లక్ష్యమని ఆ సంస్థ కొత్త ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన కె. రామ్మోహనరావు అన్నారు. కార్గో హ్యాండ్లింగ్‌ను 70 మిలియన్ టన్నలు సాధించాలన్నదే ధ్యేయంగా పనిచేస్తామని తెలిపారు. విశాఖలోని పోర్ట్ ప్రధాన కార్యాలయంలో ఆయన బాధ్యతలను చేపట్టారు. పశ్చిమగోదావరి జిల్లా స్వస్థలమైన రామ్మెహన్‌రావు... ఉత్తరప్రదేశ్ క్యాడర్‌కి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆర్థిక మాంద్యం పరిస్ధితులు... తమ పోర్ట్‌పై ప్రభావం చూపటం లేదని... ఇప్పటి వరకు ఉన్న గణాంకాలు చెబుతున్నాయని ఆయన చెప్పారు. భారీ నౌకలను ఇన్నర్ హార్బర్లోకి తీసుకు వచ్చే వెసులు బాటుపై జరిగిన అధ్యయాలను కార్యరూపంలో ముందుకు తీసుకువెళ్తామని వివరించారు. పోర్ట్ ఆధారిత అభివృద్ధిని, కాలుష్యాన్ని బాగా తగ్గించేట్టుగా చేయాలన్నది తమ లక్ష్యాలలో ఒకటని ఆయన వెల్లడించారు.
విశాఖ పోర్టుకు నూతన ఛైర్మన్‌గా రామ్మోహనరావు - vizag new port chairman take charge
విశాఖపట్నం పోర్ట్ కొత్త ఛైర్మన్‌గా ఉత్తర్ ప్రదేశ్ క్యాడర్‌కి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి రామ్మోహన్రావు బాధ్యతలు చేప్టటారు. దేశంలోనే విశాఖ పోర్ట్‌ను తొలి స్థానంలో నిలపాలన్నదే లక్ష్యంగా అడుగుల వేస్తామని తెలిపారు.
విశాఖ పోర్టుకు నూతన ఛైర్మన్‌గా రామ్మోహనరావు బాధ్యతలు