విషవాయువు వందల కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. అయిదేళ్ల మణిదీప్ ఇప్పటికీ కళ్లు తెరవలేకపోతున్నాడు. గురువారం నుంచి మూసిన కళ్లు మూసినట్లే ఉన్నాయి. ఇదే ప్రమాదంలో మణిదీప్ తండ్రి ఎస్.గోవిందరాజు (40) ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే చనిపోయారు. ఆయన ఎల్జీ పాలిమర్స్‌లోనే రోజుకూలీగా పనిచేసేవారు. గోవిందరాజు మృతి విషయం శుక్రవారం వరకు కుటుంబసభ్యులకు తెలియదు. పత్రికల్లో వచ్చిన ఫొటో చూసి కేజీహెచ్‌లోని శవాగారానికి వచ్చారు. తమకు దేవుడు తీరని అన్యాయం చేశాడని గుండెలవిసేలా రోదించారు. మృతుని కుమారుడు మణిదీప్ అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా కన్నతండ్రిని కడసారి చూసేందుకూ కళ్లు తెరవలేకపోవడం కుటుంబసభ్యులను మరింత కలిచివేస్తోంది. మణిదీప్ కళ్లకు చికిత్స చేయించేందుకు నేత్రవైద్య నిపుణులను తీసుకొస్తున్నట్లు కేజీహెచ్ సూపరింటెండెంట్ డా.అర్జున్ తెలిపారు.
విశాఖ విషాదం : ఆ కళ్లకేం తెలుసు కల్లోలం జరిగిందని!
వాయువే ఆయువు తీసింది...విషం నింపుకొచ్చి వందల కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చింది. గాఢ నిద్రలోంచి కొందరిని శాశ్వత నిద్రలోకి పంపింది. ఈ దుర్ఘటనలో గాయపడిన అయిదేళ్ల బాలుడు మణిదీప్ ఇప్పటికీ కళ్లు తెరవలేని స్థితిలో ఉన్నాడు. అదే ప్రమాదంలో చనిపోయిన కన్నతండ్రి కడసారి చూపుకు కూడా నోచుకులేకపోయాడు.
విశాఖలో కళ్లు తెరవలేని స్థితిలో ఐదేళ్ల చిన్నారి